Sachivalayam.in

  • Volunteer
  • AP Sachivalayams
    • Know Your Volunteer
    • Volunteer Details
  • UP GP List
  • CONTACT US

నాలుగో విడత టిడ్కో ఇళ్లు పంపిణీకి ఏర్పాట్లు | TIDCO houses | AP Housing | Arrangements for the distribution of the fourth installment

January 29, 2023 by bharathi Leave a Comment

Hi Friends, welcome to “NAVARATNALU.COM” through this article you can find Arrangements for the distribution of the fourth installment of TIDCO houses. The Chief Minister later reviewed the construction progress of Andhra Pradesh Township And Infrastructure Development Corporation (TIDCO) houses. Officials said that all 1.40 lakh houses will be ready in 15-20 days.

వచ్చే నెల మొదటి వారంలో 14,460 యూనిట్ల అందజేత

టిడ్కో బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం

పట్టణ పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న టిడ్కో (జీ+3) ఇళ్లు నాలుగో విడత పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి మొదటి వారంలో 14,460 మంది లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలు, పెండింగ్‌ పనులపైనా టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, ఎండీ శ్రీధర్‌ అధ్యక్షతన బుధవారం బోర్డు డైరెక్టర్లు సమావేశమై చర్చించారు.

నంద్యాల, శ్రీకాకుళం, పొన్నూరు, అడవి తక్కెళ్లపాడు, సాలూరు, కావలి ప్రాంతాల్లో అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉన్నవాటిని అందజేయనున్నారు. ఇందులో నంద్యాల 5 వేలు, శ్రీకాకుళం 1,280, పొన్నూరు 2,368, అడవి తక్కెళ్లపాడు(గుంటూరు) 2,500, సాలూరు 1,200 యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. మొదటి వారానికి కావలిలో మరో 2,112 యూనిట్లు కూడా అన్ని వసతులతో అందుబాటులోకి రానున్నాయి. కాగా, పంపిణీ చేసేనాటికి ఆయా ప్రాంతాల్లో అదనంగా ఎన్ని పూర్తయితే అన్నింటినీ అదే వేదిక ద్వారా లబ్ధిదారులకు అందజేయాలని భావిస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్లలో ప్రభుత్వం రూ. 1కే అందిస్తున్న 300 చ.అడుగుల యూనిట్లు మినహా మిగిలిన 365, 430 చ.అ విస్తీర్ణం గల ఇళ్ల విషయంలో ఇప్పటివరకు రుణాలు మంజూరు కానివారికి నాలుగైదు రోజుల్లో మంజూరు చేయించి జనవరి మొదటి వారంలో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, జనవరి చివరినాటికి సీఎం వైఎస్‌ జగన్‌ నిర్దేశించిన 1.20 లక్షల యూనిట్ల పంపిణీపై తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు.

ఇప్పటికే 75 నుంచి 80 శాతం పూర్తయిన బ్లాకులకు యుద్ధప్రాతిపదికన ఎస్టీపీలు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని, లబ్ధిదారుల బ్యాంకు లింకేజీని సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని ఆయా పట్టణ స్థానిక సంస్థల అధికారులను ఆదేశించారు. బోర్డు సమావేశంలో చీఫ్‌ ఇంజినీర్‌ గోపాలకృష్ణారెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మితో పాటు టిడ్కో బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు.

TIDCO houses

టిడ్కో బోర్డు సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ ప్రసన్న కుమార్, ఎండీ శ్రీధర్‌


Here are the number of houses to be allotted with their prices and downpayment amounts.

Residential Unit Sizes : 300 Sq. Ft.

Number of Beneficiaries : 1,43,000

Residential Unit Prices : Rs.1

DownPayment : NA


Residential Unit Sizes : 365 Sq. Ft.

Number of Beneficiaries : 44,000

Residential Unit Prices : Rs.4,00,000

DownPayment : Rs.50,000


Residential Unit Sizes : 430 Sq. Ft.

Number of Beneficiaries : 74,000

Residential Unit Prices : Rs.4,65,000

DownPayment : Rs.1,00,000


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

T Number Status Check Online | సచివాలయం సంబంధించి ఎటువంటి అప్లికేషన్ స్టేటస్ ని అయినా సులభంగా ఇలా తెలుసుకోండి

January 25, 2023 by admin Leave a Comment

హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు navaratnalu.com ఈ పేజీ ద్వారా మీరు మీ సచివాలయం లో ఎటువంటి అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నా కూడా దాని స్టేటస్ ని సులభంగా మీరే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు అది ఎలానో వివరంగా తెలుసుకోండి.

మీరు మీ సచివాలయంలో ఏదైనా అప్లికేషన్ ని దరఖాస్తు చేసుకుని ఉంటే “VM-GOCTAP” నుండి మీ మొబైల్ నెంబర్ కి Application Submitted Message ని మీ మొబైల్ నెంబర్ కి SMS ద్వారా Send చేయబడుతుంది. ఈ మెసేజ్ లో మీ అప్లికేషన్ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి (Application No / Transaction No) అనగా టీ (T) నెంబర్ తో స్టార్ట్ అయిన Number ఉంటుంది దీని ఆధారంగా మీరు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ స్టేటస్ ని ఎలా తెలుసుకోవాలో చూడండి.

AP-SEVA-PORTAL-SERVICE-REQUEST-STATUS-Check

Step by Step Process for Application Status (అప్లికేషన్ స్థితి కనుగొనండి ఇలా)

Open “AP SEVA PORTAL” (or) Click here to Open

At Top Right side you may find “Service Request Status Check“

There you can enter “T” Number and then click on “Search button“

T Number Find in SMS

VM-GOVTAP-T-NUMBER-SMS

Then the page display as mentioned below picture.

టీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పేజీ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది.

ఇక్కడ డీటెయిల్ గా మీ అప్లికేషన్ స్థితి అనేది ఇప్పుడు ఎంత వరకు వచ్చిందో చూపిస్తుంది.

ఒకవేళ అప్లికేషన్ పెండింగ్‌లో ఉంటే ఎక్కడ పెండింగ్లో ఉందో కూడా చూపిస్తుంది.

అప్లికేషన్ పూర్తవడానికి ఇంకా ఎన్నిరోజులు పడుతుందో కూడా చూపిస్తుంది.

Transaction Details

Transaction-Details

  • Once complete the Application process then the generated Certificate you can get from your Sachivalayam.

పైన చూపించిన విధంగా రైస్ కార్డు (Split) విభజనకి 180 రోజులు,  సభ్యుడు ఆడిషన్ కి (Member Add) చేసుకోవడానికి ఇరవై ఒక్క రోజు ఇలా ఒక్కో అప్లికేషన్ కి వేరు వేరు గడువు ఉంటుంది

అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. స్టేటస్ లో సక్సెస్ అని వచ్చిన తర్వాత మీరు మీ వాలంటీర్ ద్వారా గాని లేదంటే మీ సచివాలయం ద్వారా గాని ఆ సర్టిఫికేట్ ని పొందే అవకాశం ఉంది


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

ఆధార్ కార్డు పై కేంద్రం కీలక ప్రకటన జారీ | Big Alert on Aadhaar Card Holders

January 24, 2023 by bharathi Leave a Comment

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవరత్నాలు డాట్ కాం వెబ్ ఈ వెబ్ పేజీ ద్వారా ఆధార్‌ ధ్రువీకరణ సమయంలో లబ్దిదారుడి అనుమతి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం తీర్మానించింది ఎందుకో డీటెయిల్ గా చదవండి. 

దిల్లీ: ఏదైనా పని కోసం ఆధార్‌ (ధ్రువీకరణ(అథెంటికేషన్‌) చేసే ముందు పేపర్‌ మీద కానీ, ఎలక్ట్రానిక్‌ రూపంలో కానీ తప్పనిసరిగా వినియోగదారుడి అనుమతి తీసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార నంస్థ(యూఐడీఏఐ) – UIDAI తెలిపింది. ఆధార్‌ వివరాలు స్వీకరించే సంస్థలు పాటించాల్సిన మార్గదర్శకాలను సూచిస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Big Alert on Aadhaar Card Holders

వినియోగదారుడి వివరాలు తీసుకొనే సంస్థలు (రిక్వెస్టింగ్‌ ఎంటిటీస్‌) ఆన్‌లైన్‌ ధ్రువీకరణ చేసే ముందు అందుకోసం ఏయే వివరాలు సేకరిస్తున్నదీ వినియోగదారులకు అర్ధమ య్యేలా వివరించాలని పేర్కొంది. ఆధార్‌ అథెంటికేషన్‌కు సంబంధించిన లావాదేవీల వివరాలు, వినియోగదారుల నుంచి తీసుకున్న అనుమతి పత్రాలను నిర్దిష్ట గడువు వరకు ప్రత్యేకంగా నిక్షిప్తం చేయాలని సూచించింది. ఆ గడువు తర్వాత వాటిని ఆధార్‌ చట్టం పేర్కొన్న నిబంధనల ప్రకారమే ప్రక్షాళన చేయాలని పేర్కొంది.

ఆధార్‌ వివరాలను తీసుకొనే సంస్థలు వినియో గదారులతో మర్యాదతో వ్యవహరించాలని, అలాగే వారి ఆధార్‌ నంబరు గోప్యతకు ఇబ్బంది ఉండదని భరోసా ఇవ్వాలని తెలిపింది.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

PM Kisan Samannidhi Nidhi 13th installment Funds Release | ఎట్టకేలకు పిఎం కిసాన్ 13 వ విడత డబ్బులు

January 22, 2023 by admin Leave a Comment

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవరత్నాలు డాట్ కాం ఈ పేజీ ద్వారా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత ఫండ్ విడుదల గురించి తెలుసుకుందాం. ఈ పేజీ మొత్తం చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే రైతులందరికీ కూడా కీలక ప్రకటన చేసింది, రైతులందరికీ కూడా శుభవార్త అయితే చెప్పింది. ఎప్పటి నుంచో రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అయితే పెంచాలని చూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు దీనికి సంబంధించిన సమయం అయితే వచ్చింది. రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పనుంది కేంద్రం ఈ నెల 23న కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల కానున్నాయి పూర్తి వివరాలు కింద చదవండి

PM-Kisan-Samannidhi-Nidhi-13th-installment-Funds-Release

PM-KISAN : రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది కేంద్ర సర్కార్‌. ఈ నెల 23వ తేదీన కిసాన్‌ సమ్మాన్‌ నిధులు విడుదల కానున్నాయి. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యౌజన 13వ విడత డబ్బులు ఈ నెలాఖరులో ఎడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతులకోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది.

దీనిలో భాగంగా 2019లో ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం-కిసాన్‌ ) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున.. మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన 12 వాయిదాల నగదును రైతులకు అందించగా.. ఇప్పుడు 13వ ఎఏడత పీఎం కిసాన్‌ నగదు కోసం లక్షలాది మంది రైతులు ఎదురుచూస్తున్నారు. జనవరి 23న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి ఉండటంతో ఆ రోజు రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున వేస్తారని సమాచారం.

మరోవైపు రైతులు ఈనెల 15లోగా ఈకేవైసీ పూర్తి చేయాలని, ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈకేవైసీ లేకుంటే 13వ విడత డబ్బులు రావని హెచ్చరిస్తున్నారు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ – Good News for Gas Cylinder Users

January 21, 2023 by bharathi Leave a Comment

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవరత్నాలు డాట్ కాం ఈ పోస్టు ద్వారా గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ కి ఆనందంగా 50 రూపాయి ఇవ్వాలో ఇవ్వ కూడదో తెలుసుకుందాం. సిలిండర్‌ డెలివరీబాయ్‌కు అదనంగా డబ్బు ఇవ్వొద్దు ఫ్రెండ్స్ ఎందుకో కింద చదవండి తెలుసుకోండి.

Good News for Gas Cylinder Users

* తేల్చి చెప్పిన హె చ్‌వీసీఎల్‌ : గ్యాస్‌ సిలిండర్‌ను తీసుకున్న ప్రతిసారి రూ.80 లేదా రూ.50 అదనంగా చెల్లిస్తున్నారా..? ఇక ఇవ్వడం ఆపేయండి. డెలివరీబాయ్‌లకు అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని హెచ్‌పీసీఎల్‌ కంపెనీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సీకే నరసింహ స్పష్టం చేశారు.

డిస్టిబ్యూటర్లు వినియోగదారుల ఇంటి వద్దకు  గ్యాస్‌ సిలిండర్‌ చేర్చాల్సి ఉంటుందని, అందుకయ్యే ఛార్జీలు వారు చెల్లించే బిల్లులోనే కలిపి ఉంటాయని పేర్కొన్నారు. నగరానికి చెందిన రాబిన్‌ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించగా ఈ మేరకు సమాధానమిచ్చారు.


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

  • « Previous Page
  • 1
  • …
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • Next Page »

Recent Comments

  • Satyanarayana Jvv on PIDIMGOYYI2 (Sachivalayam Code : 10490308) Secretariat Details | RAJAMAHENDRAVARAM RURAL (RURAL) | EAST GODAVARI
  • Preethi on VADDE GERI (Secretariat Code : 1016029) Sachivalayam information | KURNOOL (URBAN) | KURNOOL
  • Ram on APSRTC Visakhapatnam – D | K | M | O | F | J | H – City Buses Time Table
  • Shamkarappa on 89- PEDDURU (Sachivalayam Code : 11090392) Secretariat Details | RAMA KUPPAM (RURAL) | CHITTOOR
  • Bhaskar Malepati on KAKAVEDU (Secretariat Code : 1118001) Sachivalayam information | NAGARI (MUNI) | CHITTOOR
  • Bhaskar Malepati on KAKAVEDU (Secretariat Code : 1118001) Sachivalayam information | NAGARI (MUNI) | CHITTOOR
  • V rao on G KONDURU – Meeseva Centers list, Address and Contacts Numbers
  • V rao on G KONDURU – Meeseva Centers list, Address and Contacts Numbers
  • Usha Kiran Javvadi on PONNUR (RURAL) GUNTUR District – Sachivalayam List
  • K GUNDAPPA on KODUMUR 1 (Sachivalayam Code : 11390601) Secretariat Details | KODUMUR (RURAL) | KURNOOL

Recent Posts

  • Jan Aushadhi Kendras (JAKs) List | Address & Contact Number
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • CFMS ID -Adhar Link -2023

Pages

  • About
  • About Us
  • All India Bus Stands | Bus Stops | Bus Stations Information | All States BUS DEOPT
  • Buy Adspace
  • CONTACT US
  • Contact us
  • Disclaimer
  • Hide Ads for Premium Members
  • Privacy Policy
  • Sachivalayam.in – మీ సచివాలయం గురించి తెలుసుకోండి

Copyright © 2026 - SACHIVALAYAM.IN