Sachivalayam.in

  • Volunteer
  • AP Sachivalayams
    • Know Your Volunteer
    • Volunteer Details
  • UP GP List
  • CONTACT US

MLC Voter Card Status & Polling Station Details Checking-2023

March 4, 2023 by admin Leave a Comment

MLC Voter Card Status & Polling Station Details Checking-2023

ఈ పేజీలోని ముఖ్యాంశాలు

1) MLC ఓటరు లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం

2) ఎమ్మెల్సీ ఓటర్ లిస్టులో మీపోలింగ్ స్టేషను గుర్తుంచడం ఎలా ?

3) ఓటర్ స్లిప్పులు పంపిణీ

4) MLC ఎలక్షన్ తేదీ?

5) MLC లు ఎన్ని రకాలు & ఓటింగ్ వేయు విధానము

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలుకి సంబంధించిన సంక్షేమ పథకాల గురించి మరియు జాబ్ నోటిఫికేషన్ గురించి నూతన సమాచారం ఎప్పటికప్పుడు పొందాలి అనుకుంటే ఈ క్రింది గ్రూప్ నందు జాయిన్ అవగలరు.

1) MLC ఓటరు లిస్ట్ లో మీపేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం?
జ) ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో గ్రాడ్యుయేషన్ MLC లకు మరియు టీచర్ల MLC లకు సంబంధించిన ఎన్నికలు జరగబోతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ గత డిసెంబర్ వరకు పూర్తి ఓటరు లిస్ట్ లను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండేది.కానీ ఇప్పుడు ఈ రోజు నాటికి రావడం లేదు.బహుశా మళ్లీ ఏమైనా అప్డేట్ చేస్తారేమో తెలియదు.

కానీ ఈ MLC లకు సంబంధించి ఈ ఓటరు లిస్ట్ లో మన పేరు ఉందా లేదా అని 2 రకాలుగా తెలుసుకోవచ్చు.

1) అప్లికేషను నెంబర్ ఆధారంగా

2) మీ పేరు ఆధారంగా

Checking Link : CLICK HERE

Step 1: పై లింక్ ఓపెన్ చేశాక ఈ క్రింది విధంగా పేజీ వస్తుంది.ఇక్కడ గ్రాడ్యుయేట్ కి సంబంధించిన వాళ్ళు స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటే F18 ఆప్షన్ లేదా టీచర్స్ కి సంబంధించిన వాళ్ళు అయితే F19 అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని అక్కడ అప్లికేషను నెంబర్ తెలిసినా ఎంటర్ చేయండి లేదా మీరు అప్లికేషను లో మీరు ఎంటర్ చేసిన విధంగా మీ పేరు ని అయినా ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయగలరు.

Step 2: ఇక్కడ అప్లికేషను నెంబర్ మరియు అభ్యర్థి పేరు, తండ్రి పేరు,స్టేటస్ అన్ని చూపిస్తుంది.అక్కడే చివరన View Status అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఒకవేళ ఇక్కడ రిజెక్ట్ అయిపోయివున్నా కూడా కారణాన్ని చూపిసస్తుంది.

Step 3: ఈ పేజీ నందు అభ్యర్థి యొక్క రిజిస్ట్రేషన్ స్టేటస్ ని ప్రింట్ తీసుకోవచ్చును.

గమనిక: ఈ ప్రింట్ తీసుకుని పోయి ఓటు వేయచ్చా అంటే లేదు. ఇది కేవలం స్టేటస్ చూసుకోవడానికి మాత్రమే.

2) ఎమ్మెల్సీ ఓటర్ లిస్టులో మీపోలింగ్ స్టేషను గుర్తుంచడం ఎలా?
జ) పైన చెప్పిన విధంగా మీ కార్డ్ Approved అని వచ్చిన తర్వాత అక్కడ అప్లికేషను నంబర్ ని Copy చేసి పెట్టుకోండి.లేదా ఒక దగ్గర రాసి పెట్టుకోండి ఎందుకంటే ఆ నెంబర్ సాయంతోనే పోలింగ్ స్టేషన్ ని కనుక్కోగలము.

POLING STATION CHECKING : CLICK HERE

Step 1: ఇక్కడ కూడా మొదట ఆప్షన్ లో మీరు గ్రాడ్యుయేషన్ ఓటరా లేదా టీచర్స్ కి సంబంధించిన ఓటరా అని ఆప్షన్ ఎంచున్నాక,ఆ తర్వాత మీ పాత జిల్లాని ఎంపిక చేసుకోవాలి.

తరువాత అక్కడ అప్లికేషను నెంబర్ లేదా పేరు తో కూడా పోలింగ్ స్టేషన్ ని తెలుసుకునే విధానం ఇచ్చారు.కానీ ఈ రోజు నాటికి అయితే అప్లికేషను నెంబర్ ఉంటేనే చెక్ చేసుకునేలా ఉంది.పేరు తో చూద్దామంటే ఆప్షన్ సెలెక్ట్ అవడం లేదు. బహుశా తరువాత ఏమైనా అప్డేట్ చేస్తారేమో చూద్దం.

Step 2: ఇక్కడ మీ వివరాలు తోపాటు పోలింగ్ స్టేషన్ వివరాలు మరియు ఆ లిస్ట్ లో మీ సీరియల్ నంబర్ ని కూడా చూపిస్తుంది.

ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే అక్కడే చివరన View Polling Station అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.ఆ తరువాత ప్రింట్ ఈ విధంగా కనిపిస్తుంది.

3) ఓటర్ స్లిప్పులు పంపిణీ
జ) ఈ MLC ఎన్నికల కొరకు ఓటరు స్లిప్ ల పంపిణీని మార్చి 7 వతేదీ లోపల అందరికి పంపిణీ చేయాలని అధికారులకు ఎలక్షన్ కమిషన్ సూచించింది.

Know Your BLO : CLICK HERE

4) MLC ఎలక్షన్ తేదీ?
జ) ఆంద్ర ప్రదేశ్ కి సంబంధించి గ్రాడ్యుయేషన్ మరియు టీచర్లకు సంబంధించిన MLC ఎన్నికలకు మార్చి 13 వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుపబడును.

5) MLC లు ఎన్ని రకాలు & ఓటింగ్ వేయు విధానము ?
జ) దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ని గతంలోనే వీడియో రూపంలో చెప్పడం జరిగింది.కావున ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకోగలరు.

Filed Under: News

1000 Views కోసం Youtube ఎంత డబ్బు చెల్లిస్తుంది ? | యూట్యూబర్‌ల కోసం ట్రిక్స్ | 1K వీక్షణలకు YouTube చెల్లింపులు

March 3, 2023 by bharathi Leave a Comment

YouTubeలో 1000 వీక్షణల కోసం మీరు ఎంత డబ్బు పొందవచ్చు : యూట్యూబ్‌లో 1000 Views కి , 1 డాలర్ లేదా  2 డాలర్లు లేదా  5 డాలర్లు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ అంత మొత్తం వస్తే ఎవరూ రోడ్ల మీదకు రారు, అందరూ యూట్యూబ్‌లో నే పనిచేస్తారు, బి-టెక్, ఎం-టెక్, ఎంఎస్, ఎంటెక్, ఇవన్నీ ఎవరూ చేయరు, అందరూ యూట్యూబ్‌లో వీడియోస్ చేసుకుంటూ కూర్చుంటారు.

యూట్యూబ్ మీరు అనుకున్నంత సులువు కాదు, అనుకున్నంత కష్టం కాదు. కాబట్టి, మీరు 1000 వ్యూస్ కి  ఎంత పొందవచ్చు అనేది మా టాపిక్. చెల్లింపు రుజువుతో మీరు 1000 వీక్షణల కోసం ఎంత పొందవచ్చో మేము మీకు తెలియజేస్తాము.

Date Page views Impressions Clicks Page RPM Impre

ssion RPM

Active View Viewable Total

earnings

Estim

ated earnings

Sun, Dec 11, 2016 4,45,185 95,280 11.601 $0.20 $0.94 89.17% $89.62 $0.00
Mon, Dec 12, 2016 5,37,178 1,32,911 10,610 $0.17 $0.70 89.97% $92.46 $0.00
Tue, Dec 13, 2016 5,73,047 1,17,877 12,812 $0.20 $0.98 90.93% $114.94 $0 00
Wed. Dec 14, 2016 5,37,463 1,23,570 14,137 $0.23 $0.99 87.67% $122.41 S0.00
Thu.Dec 15.2016 4,24,724 90,308 10.392 $0.23 $1.08 88.44% $97.35 S0.00
Fri. Dec 16. 2016 4,73,292 105.749 10,802 $0 22 $100 88% $105 55 $0 00
Sat  Dec 17, 2016 4,27,903 1,03,446 10689 $0 24 $0 99 89% $102 76 $0.00
Totals 34,18,792 7,69,141 81,043 $0.21 $0.94 89% $725.09 $0.00
Averages 488.398 109.877 11.577 – – – $103.58 S0.00

మన యాడ్‌సెన్స్‌లో ఇంత వీక్షణలు స్పష్టంగా పొందవచ్చు. నేను మీకు గత 7 రోజులు చూపిస్తున్నాను. డిసెంబర్ 11 ఆదివారం నాడు మనకు 4,45,000 వ్యూస్ వచ్చాయి అనుకుందాం. మనకు 4,45,000 వీక్షణలు వస్తే, మనకు 95,280 ప్రకటనలు వస్తాయి. 4,5 లక్షల వ్యూస్ వస్తే లక్ష యాడ్స్ వస్తాయి. మనకు 1 లక్ష ప్రకటనలు వస్తే, 11,000 మంది ఆ యాడ్‌కి కనెక్ట్ అవుతారు. ఆ యాడ్‌ని క్లిక్ చేస్తే మనకు 89 డాలర్లు వస్తాయి.

4,5 లక్షల వ్యూస్ వచ్చినప్పుడు 1 లక్ష యాడ్స్ ఎందుకు వచ్చాయని చాలా మంది అడుగుతుంటారు. మేము ప్రతిదానికీ ప్రకటనలను పొందాలి, మేము ఇప్పటికే మానిటైజేషన్‌ని ఆన్ చేసాము. కాబట్టి, ప్రతి వీక్షణకు ప్రకటనలు ప్రదర్శించబడవు. మీరు దానిని గుర్తుంచుకోవాలి. కొంతమంది మన వీడియో తీసి ఇతర వెబ్‌సైట్లలో పొందుపరుస్తారు. ఇతర వెబ్‌సైట్లలో పొందుపరచడం మంచిది, మనకు వీక్షణలు వస్తాయి. కానీ, ఆదాయం మాత్రం రాదు. మేము ఇతర వెబ్‌సైట్‌ల ద్వారా ట్రాఫిక్‌ను పొందుతాము

కానీ, ఆదాయం మాత్రం రాదు. ఇది చాలా తక్కువగా ఉంటుంది. అది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏమిటంటే, ఎవరైనా ఉదయం నుండి సాయంత్రం వరకు 50-60 వీడియోలు చూశారనుకోండి. అతను 61 వీడియోలను చూశాడనుకుందాం. 60 వీడియోలను చూసిన తర్వాత, 61 వీడియోలకు ప్రకటనలు రావు. 10 వీడియోలను చూసిన తర్వాత, 11 వీడియోలకు ప్రకటనలు రావు. మీరు 11 వీడియోల నుండి చాలా వీడియోలను చూస్తే, ఆ వీడియోలకు మీకు ప్రకటనలు రావు. కొన్ని దేశాల నుండి ప్రకటనలు ప్రదర్శించబడవు

మేము కొన్ని దేశాల నుండి ప్రకటనలను చూసినప్పుడు రేటు తక్కువగా ఉంటుంది. మేము USA మరియు జర్మనీ వంటి కొన్ని దేశాల నుండి ప్రకటనలను చూసినప్పుడు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటన్నింటిని మనం ఆధారం చేసుకోవాలి. అతను మొబైల్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా కంప్యూటర్ నుండి ప్రకటనలను చూశారా. అతను YouTube పేజీ, YouTube యాప్ లేదా ఇతర వెబ్‌సైట్ నుండి ప్రకటనలను చూశారా. సమయం వంటి విభిన్న కారకాలు ఉన్నాయి.

అతను ప్రకటనలను ఎప్పుడు చూశాడు?

ఉదయాన్నే చూస్తే వన్ రేట్. మధ్యాహ్నానికి వాడు చూస్తే ఇంకో రేటు. ప్రతి నిమిషం ప్రకటన రేటు మారుతుంది. కాబట్టి, ప్రకటన ఖర్చుపై ఆధారపడి ఉంటుంది, ప్రకటన చౌకగా ఉంటుంది, ఇది దాటవేయబడుతుందా, దాటవేయబడదు, ప్రదర్శన లేదా స్పాన్సర్. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఆ సమయంలో, ఏ ప్రకటన స్క్రీన్‌పై ఉందో, ఆ ప్రకటన యూట్యూబ్‌లో ప్రదర్శించబడుతుంది. కాబట్టి, చాలా ఆలస్యం అవుతుంది. ప్రకటన 50% కంటే ఎక్కువ సమయం ప్రదర్శించబడితే, అది ప్రకటనలను ప్రదర్శించదు. కాబట్టి, ఇది చాలా స్పష్టంగా ఉంటుంది

తర్వాత, ప్రకటన 537000 వీక్షణలు మరియు 132000 ప్రకటనల కోసం మాత్రమే ప్రదర్శించబడితే. అప్పుడు, అది 10000 మంది ద్వారా క్లిక్ చేయబడుతుంది. ప్రకటనను క్లిక్ చేస్తే, అది వీడియోకు లేదా ఏదైనా ఇతర ప్రకటనలకు కనెక్ట్ చేయబడుతుంది. దీని ధర 92 డాలర్లు. ఇలా చూస్తే 5 లక్షల వ్యూస్ కి 500 డాలర్లు ఖర్చవుతుంది. ఇది 1000 వీక్షణలు అయితే, దాని ధర 1 డాలర్. నా లెక్క ప్రకారం, YouTube సగటు ఆదాయం 30 నుండి 40 డాలర్లు ఉంటుంది. అది మీరందరూ గమనించవలసిన విషయం. ఎందుకంటే, నేను మీకు చెప్పిన కారణాలన్నీ దానికి కారణం. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1000 వీక్షణలకు 1 డాలర్ ఖర్చవుతుందని మనం అనుకుంటే, YouTubeలో డబ్బు సంపాదించడం చాలా కష్టం

1 లక్ష వ్యూస్ కి 30 డాలర్లు రాబట్టడం బావుంటుందని అనుకుంటే

1 లక్ష వీక్షణలకు మనం 30 డాలర్లు సంపాదిస్తాము అనుకుందాం. మేము YouTubeకి 45% ఇవ్వాలి. ఆ 45% యూట్యూబ్ తీసుకుంటుంది. మీరు MCNలో ఉన్నారని అనుకుందాం. మీరు YouTubeకి 45% ఇవ్వాలి. మీరు MCNకి 30% ఇవ్వాలి. ఇది మీ విషయానికి వస్తే చాలా తక్కువగా ఉంటుంది.

ఇలా జరగాలి . కాబట్టి, మీరందరూ గమనించవలసినది. యూట్యూబ్‌లో ఆదాయం అంత సులభం కాదు. చాలా మంది వీడియో చూస్తే లక్ష, 2 లక్షల వ్యూస్ వస్తాయని అనుకుంటారు. 5 లక్షలు లేదా 6 లక్షల వ్యూస్ వస్తే. అంత మొత్తం వారికి అందదు. వీడియోకి 5 లక్షల వ్యూస్ వస్తే 100 డాలర్లు ఖర్చవుతుంది. నా అంచనా ప్రకారం. 100 డాలర్లు అంటే 6000.  6 లక్షల మంది వ్యక్తులను చేరుకోవాలంటే, వారు వీడియోను శక్తివంతం చేయాలి. వారు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. వీడియో చేయడానికి వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది. అది ఎవరికీ తెలియదు. నెలలో రాదు కూడా . నెల తర్వాత వీక్షణలు వస్తాయి. పెట్టిన పెట్టుబడి వారికి అందుతుంది. వాళ్లు షార్ట్ ఫిల్మ్స్ తీయాలి

కాబట్టి, ఆదాయం తక్కువగా వస్తున్నది ఎవరు?

కొంతమంది నన్ను అడుగుతున్నారు, నాకు 1000 వీక్షణలు వచ్చాయి, కానీ నాకు 1 డాలర్ రాలేదు, ఇది 0. 5 లేదా 0. 3ని చూపుతుంది, అందుకే ఇది విషయం. యూట్యూబ్‌కి ఇంత మొత్తం వస్తుందని స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి, మీరు మీ సమాచారాన్ని ఆధారం చేసుకోవచ్చు మరియు వీడియోలను రూపొందించవచ్చు. దీన్ని గుర్తుంచుకోండి స్నేహితులు, మీరు మీ యాడ్‌సెన్స్ ఆదాయాలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎంత పొందుతారో కూడా మీరు అర్థం చేసుకుంటారు, ఆ కోణంలో ఇది చాలా స్పష్టంగా ఉంటుంది, మీ స్నేహితులకు కూడా అవగాహన కల్పించండి ఎందుకంటే అందరూ కోట్లు సంపాదిస్తున్నారని చాలా మంది అనుకుంటారు.

“navaratnalu.com“తో టచ్‌లో ఉండండి


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాల కోసం, దయచేసి దిగువ వ్యాఖ్య సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

Villages Digital Librarys – మరో 6,965 గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు

March 2, 2023 by admin Leave a Comment

డిజిటల్ లైబ్రరీ కొరకు స్థలం సేకరణ కొరకు కలెక్టర్లకు ఆదేశాలు.

Villages-Digital-Librarys

  • ఏడాదిన్నర క్రితమే 3,960 లైబ్రరీ ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగింది.
  • ఒక్కోక్క లైబ్రరీ అంచనా వ్యాయం 16, లక్షలతో నిర్మాణం పనులు.
  • గ్రామ సచివాలయం ఉన్న ప్రతి ఒక్క చోట ఒక లైబ్రరీ ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది.

ఇంటి నుండి పని , చేసుకొనే IT ఉద్యోగులకూ అవసరమయ్యే సౌకర్యాలు విద్యార్థులకు ఆన్‌లైన్ డిజిటల్ క్లాస్ అవసరమగు సమాచారం ప్రతి గ్రామానా ఉండేలా డిజిటల్ లైబ్రరీ లు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఇప్పటికే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 3,690 డిజిటల్ లైబ్రరీ ల యేర్పాటు జరుగుతోంది.

ఇందులో కొన్ని పూర్తవగా నిర్మాణ దశలో ఉన్న గ్రామ సచివాలయం ఉన్న ప్రతి ఒక్క చోట డిజిటల్ లైబ్రరీ ఉండేందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిబంధనల మేరకు గ్రామీణ అభివృద్ధి శాఖ కొత్తగా మరో 6,965 గ్రామాలకు వీటిని నిర్మించేందుకు అనుమతులు ఇచ్చింది ఇందులో మొత్తం 10, 925 గ్రామాల డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి.

డిజిటల్ లైబ్రరీ సౌకర్యాలు:

ఇంటర్నెట్ సదుపాయం కలదు.

ముఖ్యంగా ఐటి ఉద్యోగులకు విద్యార్థులకు వర్క్ ఫ్రం హోం చేయు ఉద్యోగులు వారి స్వగ్రామం నుండి ఉద్యోగం చేసుకునే వెసులబాటు.

విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులు హాజరు కావడానికి వారికి అవసరమైన సమాచారం ఆన్‌లైన్ డిజిటల్ విధానం ద్వారా సేకరించడానికి ఈ లైబ్రరీలు అవసరం అవుతాయి.

ఏపీ ప్రభుత్వం ఇవ్వబడిన ఆదేశాలు :

ప్రభుత్వం ఒక్కో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి 16, లక్షలు ఖర్చు చేస్తే వేరే ఇతర సౌకర్యాల కోసం మరికొంత ఖర్చు పెట్టబడుతుంది .

భవన నిర్మాణాలకు స్థల సేకరణ చేయడానికి ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు జారీ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో కేవలం డిజిటల్ లైబ్రరీ నిర్మాణాలకై ఏపీ ప్రభుత్వం రూ, 1,114 కోట్లు ఖర్చు చేస్తోంది.

Filed Under: News

విద్యుత్‌ పీపీఏల టారిఫ్‌ | ఇక ఇదే రేటు | APERC Has Fixed Tariff Wind Power PPAS Beyond Ten Years

March 1, 2023 by bharathi Leave a Comment

పదేళ్లు దాటిన పవన విద్యుత్‌ పీపీఏల టారిఫ్‌ నిర్ణయించిన ఏపీఈఆర్సీ.

11 నుంచి 20 ఏళ్ల వరకు యూనిట్‌ రూ.2.64.

ఇరవై ఏళ్లు దాటిన పీపీఏల రద్దుకు డిస్కంలకు అవకాశం.

కొనసాగితే విద్యుత్‌ ఉత్పత్తి, డిస్కంల పరస్పర అంగీకారంతో టారిఫ్‌.

రాష్ట్రంలో ప్రస్తుతం పవన విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 4096.65 మెగావాట్లు.

గతేడాది డిసెంబర్‌ నాటికి 40.9 మెగావాట్ల కొత్త ప్రాజెక్టులు.

9.8 శాతం వాటాతో దేశంలోని మొదటి 10 రాష్ట్రాల్లో ఏపీ.

APERC Has Fixed Tariff Wind Power PPAS Beyond Ten Years

పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 4,096.65 మెగావాట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి 15 మిలియన్‌ యూనిట్ల నుంచి 20 మిలియన్‌ యూనిట్ల మధ్య పవన విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.

భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పవన విద్యుత్‌ ధరలను నిర్ణయించింది. యూనిట్‌ రూ.2.64గా నిర్దేశించింది. యూనిట్‌కు రూ.3.43 ఇవ్వాలని విండ్‌ పవర్‌ జనరేటర్లు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఇరవై ఏళ్ల తరువాత మీ ఇష్టం.
విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి పవన విద్యుత్‌ను తీసుకుంటున్న డిస్కంలు మొదటి పది సంవత్సరాలకు యూనిట్‌కు రూ.3.50 చొప్పున చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్‌సీ ఆదేశాలిచ్చింది. అయితే 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.3.43, లేదా అంతకంటే ఎక్కువ టారిఫ్‌ ఇవ్వాలని పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్‌సీని కోరాయి.

డిస్కంలు మాత్రం మొదటి పదేళ్లకే ఏపీఈఆర్‌సీ టారిఫ్‌ ఇచ్చిందని, దానికి జనరేటర్లు కూడా అంగీకారం తెలిపారని, ఆ తరువాత పదేళ్లకు టారిఫ్‌ను మండలి నిర్ణయించాల్సి ఉందని తేల్చి చెప్పాయి. దీనిపై స్పందించిన ఏపీఈఆర్‌సీ.. పవన విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్లు యూనిట్‌కు రూ.3.50గా నిర్ణయించామని తెలిపింది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది.

11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పవన విద్యుత్‌ టారిఫ్‌ యూనిట్‌కు రూ.2.64 గా నిర్థారించింది. ఇరవై ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. ఒక వేళ పీపీఏలను కొనసాగిస్తే విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్‌ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్‌కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది.

పవన విద్యుత్‌కు అనుకూలంగా రాష్ట్రం.
కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తికి ప్రోత్సాహాన్నిస్తోంది. అదే సమయంలో డిస్కంలు ఆర్ధికంగా నష్టపోకుండా కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా పవన విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యం 8 శాతం పెరిగితే రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయి వృద్ధికంటే 1.8 శాతం ఎక్కువ నమోదు చేసుకుని మొదటి పది రాష్ట్రాల్లో ఒకటిగా (ఆరో స్థానంలో) ఏపీ నిలిచింది.

రాష్ట్రంలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెటీయెరాలజీ (పూణె) పరిశోధకులు వెల్లడించారు. ‘కపుల్డ్‌ మోడల్‌ ఇంటర్‌–కంపారిజన్‌ ప్రాజెక్ట్‌ (సీఎంఐపీ) ప్రయోగాలలో సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీలో గాలి సామర్ధ్యం పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో గతేడాది డిసెంబర్‌ నాటికి (నాలుగో త్రైమాసికంలో) దేశవ్యాప్తంగా 229 గిగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులు పెరగగా, మన రాష్ట్రంలో 40.9 మెగావాట్ల కొత్త ప్రాజెక్టులు వచ్చాయి.

Filed Under: News

పాడి రైతుకు తోడు | In Addition to The Dairy Farmer

March 1, 2023 by admin Leave a Comment

ఆర్బీకేల ద్వారా అన్నదాత ముంగిట్లో పశు వైద్యసేవలు.

హెల్త్‌ కార్డులతోపాటు గ్రామస్థాయిలో శిబిరాలు.

సర్టిఫై చేసిన పశుగ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా.. పశువులు, మేకలు, గొర్రెల పెంపకందారుల కోసం పశువిజ్ఞాన బడులు.

పాడిరైతుల సమస్యల పరిష్కారానికి టోల్‌ ఫ్రీ నెంబర్లు.. మూగ జీవాల కోసం వైఎస్సార్‌ సంచార పశు వైద్య సేవలు.

108 అంబులెన్స్‌ల తరహాలో పశువులకు వైద్యసేవలు దేశంలోనే తొలిసారి.

Veterinary Services Farmers Through Rythu Bharosa Centres

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు పాడి రైతన్నలకు బాసటగా నిలుస్తూ పశువులకు పూర్తిస్థాయి ఆరోగ్య భద్రత కల్పిస్తు­న్నాయి. ఆర్బీకేల రాకతో తమ కష్టాలకు తెర పడిం­­దని పాడి రైతులు చెబుతున్నారు. ప్రాథ­మిక వైద్యం కోసం మండల కేంద్రాల వద్ద పడి­గాపులు కాయాల్సిన అవస్థలు తొలగిపోయాయి. ఆర్బీకేలతో గ్రామ స్థాయిలో పశువైద్య సేవ­లందిం­చడమే కాకుండా సర్టిఫై చేసిన నాణ్యమైన పశు­గ్రాస విత్తనాలు, సంపూర్ణ మిశ్రమ దాణా, మిన­రల్‌ మిక్చర్, చాప్‌ కట్టర్స్‌.. ఏది కావా­లన్నా గుమ్మం వద్దకే తెచ్చి ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

108 అంబులెన్స్‌ల తరహాలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. రూ.240.69 కోట్ల వ్యయంతో రెండు విడతల్లో 340 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు.

వీటిని నియోజక వర్గానికి రెండు చొప్పన అందుబాటులోకి తీసుకొచ్చి ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ప్రతి అంబులెన్స్‌ లో రూ.35 వేల విలువైన 81 రకాల మందులను అందుబాటులో ఉంచారు. 54 రకాల అత్యాధునిక పరికరాలతో పాటు వెయ్యి కిలోలు బరువున్న జీవాలను ఎత్తగలిగేలా హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యం కల్పించారు.

ఇప్పటివరకు కాల్‌ సెంటర్‌కు రైతుల నుంచి రోజుకు సగటున 1500 కాల్స్‌ చొప్పున 3.90 లక్షల కాల్స్‌ రాగా మారుమూల పల్లెల్లో 1.30 లక్షల ట్రిప్పులు తిరిగాయి. దాదాపు 2 లక్షలకుపైగా పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించారు. ఇప్పటి వరకు 1.35 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఏపీ తరహాలో పంజాబ్, కేరళ, ఛత్తీస్‌ ఘడ్‌ తదితర రాష్ట్రాలు వెటర్నరీ అంబులెన్స్‌లను తీసుకొస్తున్నాయి. ఆర్బీకేల ద్వారా అందిస్తున్న పశు వైద్యసేవలపై ‘సాక్షి బృందం’ రాష్ట్రవ్యాప్తంగా క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించింది.

మూగ జీవులపై మమకారం..
వైఎస్సార్‌ పశు సంరక్షణ పథకం కింద పశువులకు హెల్త్‌కార్డులు జారీ చేయడమే కాకుండా పాడి రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులతో ఆర్ధిక చేయూతనిస్తున్నారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నారు. కృత్రిమ గర్భదారణ, పునరుత్పత్తి, దూడల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రతినెలా 3వ శనివారం పాడి రైతులకు, 2, 4వ బుధవారాల్లో గొర్రెలు, మేకల పెంపకందారులకు వైఎస్సార్‌ పశువిజ్ఞానబడులు నిర్వహిస్తూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆర్బీకేల్లో దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా పాడి, మూగజీవాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. పాడి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 155251, 1962 టోల్‌ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు.

రెండున్నరేళ్లలో సేవలిలా..
రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాగా పాడి సంపద ఎక్కువగా ఉన్న 8,330 ఆర్బీకేల్లో ట్రైవిస్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి నెలా రూ.4 వేల విలువైన మందులను సరఫరా చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా గత 32 నెలల్లో 4,468 టన్నుల గడ్డి విత్తనాలు, 62,435 టన్నుల సంపూర్ణ మిశ్రమం, 60 వేల కిలోల నూట్రిషనల్‌ సప్లిమెంట్స్, 350 టన్నుల పశువుల మేతతో పాటు 3,909 చాప్‌ కట్టర్స్‌ పంపిణీ చేశారు.

ఆర్బీకేల ద్వారా 2 కోట్ల పశువులకు టీకాలిచ్చారు. 33.08 లక్షల పశువులకు హెల్త్‌ కార్డులు జారీ చేశారు. 14.73 లక్షల పశువులకు కృత్రిమ గర్భధారణ జరిగింది. 1.61 కోట్ల పశువులకు ప్రాథమిక వైద్యసేవలు అందించారు. పశువిజ్ఞాన బడుల్లో 13.99 లక్షల మంది రైతులకు శిక్షణ నిచ్చారు. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు 42 వేల మంది రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులందించి రుణ పరపతి కల్పిస్తున్నారు.

Filed Under: News

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • …
  • 15
  • Next Page »

Recent Comments

  • Satyanarayana Jvv on PIDIMGOYYI2 (Sachivalayam Code : 10490308) Secretariat Details | RAJAMAHENDRAVARAM RURAL (RURAL) | EAST GODAVARI
  • Preethi on VADDE GERI (Secretariat Code : 1016029) Sachivalayam information | KURNOOL (URBAN) | KURNOOL
  • Ram on APSRTC Visakhapatnam – D | K | M | O | F | J | H – City Buses Time Table
  • Shamkarappa on 89- PEDDURU (Sachivalayam Code : 11090392) Secretariat Details | RAMA KUPPAM (RURAL) | CHITTOOR
  • Bhaskar Malepati on KAKAVEDU (Secretariat Code : 1118001) Sachivalayam information | NAGARI (MUNI) | CHITTOOR
  • Bhaskar Malepati on KAKAVEDU (Secretariat Code : 1118001) Sachivalayam information | NAGARI (MUNI) | CHITTOOR
  • V rao on G KONDURU – Meeseva Centers list, Address and Contacts Numbers
  • V rao on G KONDURU – Meeseva Centers list, Address and Contacts Numbers
  • Usha Kiran Javvadi on PONNUR (RURAL) GUNTUR District – Sachivalayam List
  • K GUNDAPPA on KODUMUR 1 (Sachivalayam Code : 11390601) Secretariat Details | KODUMUR (RURAL) | KURNOOL

Recent Posts

  • Jan Aushadhi Kendras (JAKs) List | Address & Contact Number
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • CFMS ID -Adhar Link -2023

Pages

  • About
  • About Us
  • All India Bus Stands | Bus Stops | Bus Stations Information | All States BUS DEOPT
  • Buy Adspace
  • CONTACT US
  • Contact us
  • Disclaimer
  • Hide Ads for Premium Members
  • Privacy Policy
  • Sachivalayam.in – మీ సచివాలయం గురించి తెలుసుకోండి

Copyright © 2026 - SACHIVALAYAM.IN