Sachivalayam.in

  • Volunteer
  • AP Sachivalayams
    • Know Your Volunteer
    • Volunteer Details
  • UP GP List
  • CONTACT US

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం | AP is a haven for investments

February 16, 2023 by bharathi Leave a Comment

పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం -జగన్ ప్రభుత్వం పై పారిశ్రామిక వేత్తల ప్రశంసలు (ఢిల్లీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సన్నాహక సదస్సు, Jan 31,2023)

1) ఆంధ్రప్రదేశ్‌కు సీఎం జగన్‌ పెద్ద ఆస్తి
– సుమంత్‌ సిన్హా, అసోచామ్‌(ASSOCHAM) అధ్యక్షుడు

ఏపీకు పెద్ద సీఎం జగన్‌ పెద్ద ఆస్తి. ఆయన నాయకత్వంలో రాష్ట్రం పరిశ్రమలకు అనుకూలంగా ఉంది. ఏపీని గమ్య­స్థానంగా ఎంచుకోవాలని పారిశ్రామికవే­త్త­లం­దరినీ కోరు­తు­న్నా. రాష్ట్రంలో పారిశ్రామిక విధానాలు స్నేహ పూర్వకంగా ఉన్నా­యి.

రాష్ట్ర జీడీపీ 50 బిలియన్‌ డాలర్లకు పైగా దేశంలో ఎని­మిదో స్థానంలోఉంది.

మూడే­ళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజి­నెస్‌లో తొలి స్థానంలో ఉంది.

రెన్యువబుల్, క్లీన్‌ ఎనర్జీలో ముం­దంజలో ఉంది.
ఏపీకి పారిశ్రామిక వేత్తలు రావడా­నికి సహా­య అందించడానికి సీఎం ముందుచూ­పుతో ఉన్నారు.


2) ఏపీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాం
– దేవయాని ఘోష్, నాస్‌కామ్‌ (NASSCOM) అధ్యక్షురాలు

ఏపీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాం. ఇప్పటికే సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఏపీతో కలిసి పని చేస్తున్నాం. డీప్‌టెక్‌ రంగంలో కలిసి పని చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం హైపర్‌ డిజి­టల్‌ యుగంలోకి వెళ్తున్నాం. దీనికి కావా­ల్సిన వనరులన్నీ ఏపీలో ఉన్నాయి. రాష్ట్రా­నికి తీర­ప్రాంతం పెద్ద అడ్వాంటేజ్‌. బెస్ట్‌ పోర్టు ఇన్‌­ఫ్రా­స్ట్ర­క్చర్‌ ఉంది. ప్రపంచం ఎదురు చూస్తున్న ఎన­ర్జీ, లాజిస్టిక్, ఎడ్యుకేషన్‌ రంగాల్లో ఏపీకి సామ­ర్థ్యం ఉంది. సీఎం డాక్యుమెంట్‌ ఆకట్టుకుంది.


3) ప్రపంచస్థాయి కార్ల ఉత్పత్తికి ఏపీ సహకారం
– టే జిన్‌ పార్క్, ఎండీ, కియా మోటర్స్, (కొరియా)

రాష్ట్రంలో కియా నిర్వహణకు వనరుల మద్దతుతో పాటు ఆటోమోటివ్‌ బెల్ట్‌ చైన్‌ను అభివృద్ధి చేయడం, పెంపొందించడంలో ఏపీ ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంది.

ఎలక్ట్రానిక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌లతో సహా ప్రపంచ స్థాయి సౌకర్యాలతో కార్ల ఉత్పత్తికి ప్రభుత్వం మాకు సహాయం చేసింది.

కృష్ణపట్నం, చెన్నై వంటి ప్రధాన ఓడరేవులకు కనెక్టివిటీ సౌలభ్యంతో పాటు 95 దేశాలలో మా కార్లను విక్రయించడానికి వీలు కల్పించింది. కోవిడ్‌ సమయంలోనూ సురక్షితంగా కార్ల తయారీకి మాకు మద్దతిచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.


4) ఏపీలో అసాధారణ మద్దతు
– ఫణి కునార్, సీఎండీ, సెయింట్, గోబైన్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఫ్రాన్స్‌)

రెండు దశాబ్దాల్లో మేం రూ.12,000 కోట్ల­కు పైగా పెట్టుబడి పెట్టాం. కోవిడ్‌ సమయంలో ఏపీలో ఫ్యాక్టరీ ప్రారంభించాం.
ఏపీ అసాధారణ మద్దతుతో మేం ప్రారంభించిన యూ­నిట్‌ అత్యంత సంపన్నమైన యూనిట్‌గా మారింది. ఇక్కడి ప్రజల ప్రతిభ, నిబద్ధతతో కూడిన పరిపాల­నా యంత్రాంగం, రాజకీయ నాయ­కత్వం మేం మరిం­త విజయవంతమయ్యేందుకు తోడ్పడింది. దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఎంచుకుంటే, ఏపీ స్వర్గధామంగా ఉంటుంది.


5) రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో దోహదపడాలని భావిస్తున్నాం
– సెర్గియో లీ, డైరెక్టర్, అపాచీ, గ్రూప్‌ (తైవాన్‌)

2006లో షూ తయారీ సంస్థను స్థాపించాం. రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్న తొమ్మిది నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాం. ఏపీ ప్రభుత్వ మద్దతు లేకుండా కంపెనీ విజయం సాధ్యంకాదు. ఎంఓయూపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంతకం చేస్తే ఇప్పుడు మేం పనిచేస్తున్నాం. అపాచీ ఇండియా–2 ప్రాజెక్టు కోసం మేమిప్పుడు ఏపీతో కలిసి పనిచేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో దోహదపడాలని భావిస్తున్నాం.


6) వ్యాపార విస్తరణకు దేశంలో ఏపీ ఉత్తమం
–దీపక్‌ ధర్మరాజన్‌ అయ్యర్, ప్రెసిడెంట్, క్యాడ్‌బరీ ఇండియా (యూఎస్‌ఏ)

ఏపీతో భాగస్వామి కావడం మాకు గర్వకారణం. శ్రీసిటీలో మేం మా వ్యాపార యూనిట్లను ప్రారంభించినప్పటి నుండి ఏపీ చురు­కైన మద్దతిస్తోంది. రూ.2,500 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా 6వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టించాం. సంస్థలో 80­శాతం మంది ఉద్యోగులు స్థానికులే. ఇప్పటికే ఆరు ఆపరేటింగ్‌ యూనిట్లు ఉండగా, త్వరలో మరొకటి అందుబాటులోకి రానుంది. దేశం మొత్తంలోనే అత్యుత్తమ సింగిల్‌ విండో క్లియరెన్స్‌ సిస్టమ్‌ను తెచ్చినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మేం దేశవ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నా.. ఏపీ అత్యుత్తమం.


7)పెట్టుబడులను రెట్టింపు చేస్తాం
– యమగుచి, ఎండీ, టోరే ఇండస్ట్రీస్‌ (జపాన్‌)

ఇక్కడ రూ.1,000 కోట్ల పెట్టుబడితో రెండు వ్యాపార యూనిట్లు ప్రారంభించాం.

అదే సమయంలో కోవిడ్‌ మొదలైంది.
ఏపీ ప్రభుత్వ మద్దతుతో జూన్‌ 2020లో ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించాం.

2030 నాటికి మా ప్రస్తుత పెట్టుబడిని రెండింతలు కంటే ఎక్కువ పెట్టడానికి ప్రణాళిక రూపొందించుకున్నాం.


8 ) ఏపీ సహకారంతో మరింత విస్తరిస్తాం
– రోషన్‌ గుణవర్ధన, డైరెక్టర్, ఎవర్టన్‌ టీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఇటలీ)

ఏపీలో మేం గణనీయంగా అభివృద్ధి చెం­దాం. ఏపీ టీ ఉత్పత్తి చేసే రాష్ట్రం కానప్పటికీ, ఏపీపై నమ్మకం ఉంచాం. ఏపీలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అనేది గొప్పగా ఉంది. ప్రభుత్వం అందించిన సహకారంతోనే మేం ఇక్క­డ యూనిట్లు ఏర్పాటుచేశాం. మా యూనిట్లలో 99శాతం మంది ఉద్యోగులు స్థానికులే.

ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో ఏపీ సర్కారు మాకు మద్దతుగా ఉన్నందుకు ప్రభుత్వం, అధికారులకు కృతజ్ఞతలు. ఏపీలో ప్రభుత్వ సహకారంతో మరింత విస్తరించేందుకు ఎదురుచూస్తున్నాం.


9) ఏపీలో మంచి వాతావరణం
– రవిసన్నారెడ్డి, శ్రీసిటీ ఫౌండర్, ఎండీ

ఏపీలో పెట్టుబడులకు మంచి వాతావరణం ఉంది. ఈ సదస్సుకు 60 దేశాలకు సంబంధించిన పారిశ్రామిక­వేత్తలు రావడం సంతోషం. ఢిల్లీ సదస్సు విజయవంతమైంది. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. మార్చిలో విశాఖలో జరగబోయే సమ్మిట్‌ మరింత విజవయంతం అవుతుంది.


10) ముఖ్యమంత్రికి భవిష్యత్తు దార్శనికత
– సుచిత్ర ఎల్లా, సీఐఐ సదరన్‌ చాప్టర్‌ అధ్యక్షురాలు

పరిశ్రమలకు సింగిల్‌ విండో తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం ఏపీ. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉంది. సీఐఐ ఎక్కువ కాలం దివంగత సీఎం వైఎస్సార్‌తో కలిసి పని­చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌కు భవి­ష్యత్తు దార్శ­ని­కత ఉంది. తద్వారా ఏపీ ప్రగతిశీల అభివృద్ధిని చూస్తో­ంది. గ్లోబల్‌ ఎకనామిక్‌ చెయిన్‌ వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వృద్ధి ఒక బలమైన ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తోంది.

Filed Under: News

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పోసాని కృష్ణమురళి

February 16, 2023 by admin Leave a Comment

Actor Posani Krishnamurali took charge as the Chairman of Andhra Pradesh Film Development Corporation.

On 3rd February 2023

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నటుడు పోసాని కృష్ణమురళి.

Filed Under: News

బ్లూ స్టార్ ఏసీల తయారీ ప్లాంట్ | Blue Star AC Manufacturing Plant

February 16, 2023 by bharathi Leave a Comment

Blue Star AC Manufacturing Plant

శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో రూ. 540 కోట్లతో కొత్తగా నిర్మించిన బ్లూ స్టార్ ఏసీ ల మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్.

ఈ పరిశ్రమ ద్వారా కొత్తగా 1500 మందికి ఉద్యోగాలు

ఈ పరిశ్రమకి సెప్టెంబర్ 29, 2021న శంకుస్థాపన చేశారు.. ఫిబ్రవరి 2023 లో పూర్తి.

Filed Under: News

3521 కోట్లతో తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు

February 16, 2023 by admin Leave a Comment

3521 crores and nine fishing harbors : ప్రారంభానికి రెడీ అవుతున్న నెల్లూరు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌

-దీంతోపాటు వేగంగా ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నం ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం

-మొత్తంగా రూ.3,521 కోట్లతో తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు

వీటిల్లో 10,521 మెకనైజ్డ్‌ బోట్లు నిలుపుకునే అవకాశం

60,858 మంది మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం

తొలి దశ కింద రూ.1522.8 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్లు నిర్మిస్తున్నారు.

ఇందులో జువ్వలదిన్నె ప్రారంభానికి సిద్ధం అవుతుండగా, నిజాంపట్నంలో 75 శాతం పనులు పూర్తయ్యాయి. మచిలీపట్నం, ఉప్పాడ హార్బర్ల పనులు కూడా 40 శాతం పూర్తయ్యాయి.

రెండో దశ కింద రూ.1,997.76 కోట్లతో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమ గోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) హార్బర్ల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యి త్వరలో పనులు ప్రారంభించనున్నారు.

ఈ హార్బర్లన్నీ అందుబాటులోకి వస్తే 10,521 మెకనైజ్డ్‌ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 60,858 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది.

Filed Under: News

5 రూపాయలకే భోజనం.. ఆకలి తీరుస్తున్న స్పందన

February 16, 2023 by bharathi Leave a Comment

అనంతపురం (Anantapuram) నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు గల చంద్ర హాస్పిటల్ వద్ద స్పందన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఈ ట్రస్టు వారు ఐదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

ANANTAPURAM SPANDANA TRUST GIVING FOOD FOR RUPEES 5 TO POOR PEOPLE IN ANANTAPURAM FULL DETAILS

anantapuram-spandana-trust-giving-food-for-rupees-5-to-poor-people-in-anantapuram-full-details

అనంతపురం (Anantapuram) నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు గల చంద్ర హాస్పిటల్ వద్ద స్పందన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఈ ట్రస్టు వారు ఐదేళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. నిత్యం నగరంలో ఎంతోమంది ఇక్కడ ప్రతిరోజు వారి ఆకలి తీరుస్తోంది స్పందన ట్రస్ట్, నిత్యం ఎక్కువ రద్దీగల ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేయడంతో అక్కడే ఫ్రూట్స్ అమ్ముకునే తోపుడు బండి వారు, కార్మికులు, కూలీలు, ఆస్పత్రికి వచ్చే రోగులు, రోగి బంధువులు ఇలా చాలామంది నిత్యం వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటారు. నిజంగా ఇలాంటి వారికి ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

ఈ స్పందన ట్రస్ట్ వారు ఉదయం పూట రెండు రూపాయలకే ఇడ్లీ కూడా అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులలో కడుపునిండా భోజనం దొరకాలంటే వంద రూపాయలకి తక్కువ ఎక్కడా కూడా దొరకదు. అది కూడా నాణ్యత అంతగా బాగుంటుందని చెప్పలేం.

ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైనఆహారం మరియు సాంబారు పప్పు లాంటి వాటితో నిత్యం ప్రతిరోజు ఇక్కడ ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఈ ఐదు రూపాయలు భోజనం సదుపాయమే కాకుండా ఒంటరి వారిని మరియు స్కూల్ సంబంధించిన అనాథ పిల్లలకు తగినంత సహాయం, ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారని నిర్వాహకులు తెలిపారు.

నిజంగా ఐదు రూపాయలు భోజన సదుపాయం అనేది అద్భుతంగా నగరవాసులకు ఉపయోగపడుతోంద. ఈ ఐదు రూపాయల భోజనం కార్యక్రమం వల్ల ఎంతోమందికి కడుపు నింపుతోంది ప్రతిరోజు.

Filed Under: News

  • « Previous Page
  • 1
  • …
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • …
  • 15
  • Next Page »

Recent Comments

  • Satyanarayana Jvv on PIDIMGOYYI2 (Sachivalayam Code : 10490308) Secretariat Details | RAJAMAHENDRAVARAM RURAL (RURAL) | EAST GODAVARI
  • Preethi on VADDE GERI (Secretariat Code : 1016029) Sachivalayam information | KURNOOL (URBAN) | KURNOOL
  • Ram on APSRTC Visakhapatnam – D | K | M | O | F | J | H – City Buses Time Table
  • Shamkarappa on 89- PEDDURU (Sachivalayam Code : 11090392) Secretariat Details | RAMA KUPPAM (RURAL) | CHITTOOR
  • Bhaskar Malepati on KAKAVEDU (Secretariat Code : 1118001) Sachivalayam information | NAGARI (MUNI) | CHITTOOR
  • Bhaskar Malepati on KAKAVEDU (Secretariat Code : 1118001) Sachivalayam information | NAGARI (MUNI) | CHITTOOR
  • V rao on G KONDURU – Meeseva Centers list, Address and Contacts Numbers
  • V rao on G KONDURU – Meeseva Centers list, Address and Contacts Numbers
  • Usha Kiran Javvadi on PONNUR (RURAL) GUNTUR District – Sachivalayam List
  • K GUNDAPPA on KODUMUR 1 (Sachivalayam Code : 11390601) Secretariat Details | KODUMUR (RURAL) | KURNOOL

Recent Posts

  • Jan Aushadhi Kendras (JAKs) List | Address & Contact Number
  • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం | నా భూమి నా దేశం సర్కులర్ తెలుగు
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • AP Govt March and April Program & Welfare Schemes Schedule 2023 | CM YS Jagan
  • CFMS ID -Adhar Link -2023

Pages

  • About
  • About Us
  • All India Bus Stands | Bus Stops | Bus Stations Information | All States BUS DEOPT
  • Buy Adspace
  • CONTACT US
  • Contact us
  • Disclaimer
  • Hide Ads for Premium Members
  • Privacy Policy
  • Sachivalayam.in – మీ సచివాలయం గురించి తెలుసుకోండి

Copyright © 2026 - SACHIVALAYAM.IN