Sachivalayam.in

  • Volunteer
  • AP Sachivalayams
    • Know Your Volunteer
    • Volunteer Details
  • UP GP List
  • CONTACT US

తుది దశకు రైల్వే పైవంతెన పనులు | Railway overpass works in final stage

February 28, 2023 by admin Leave a Comment

అనంతపురంలోని టవర్‌క్లాక్‌ వద్ద నిర్మిస్తున్న రైల్వే పైవంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. రైల్వేట్రాక్‌పై వంతెన అనుసంధానం చేయాల్సి ఉంది.

Anantapur

ఉమానగర్‌, అనంతపురం(రైల్వే): అనంతపురంలోని టవర్‌క్లాక్‌ వద్ద నిర్మిస్తున్న రైల్వే పైవంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. రైల్వేట్రాక్‌పై వంతెన అనుసంధానం చేయాల్సి ఉంది. ఇందుకోసం రైళ్లను ఆపాల్సి ఉన్న నేపథ్యంలో జాతీయ రహదారులశాఖ అధికారులు రైల్వేబోర్డుకు ఇప్పటికే లేఖ రాశారు. నిర్మాణానికి అవసరమైన భారీ గడ్డర్లు సిద్ధం చేశారు. వాటిని ఎత్తడానికి చెన్నై పోర్టు నుంచి భారీ క్రేన్‌ తెప్పించారు. 700 టన్నుల వరకు బరువెత్తే ఈ క్రేన్‌ ఆదివారం అనంతపురానికి చేరుకుంది.

నాలుగు వరుసల రహదారి.. బళ్లారిచౌరస్తా నుంచి నడిమివంక, టవర్‌క్లాక్‌, కలెక్టరేట్‌, పండమేరు మీదుగా సమతాగ్రాం వద్ద ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు నాలుగు వరుసల రహదారి, 3 చోట్ల వంతెనలు, 3 కల్వర్టులు కలిపి ఒక ప్రాజెక్టుగా పనులు చేస్తున్నారు. ఇందుకు రూ.193 కోట్లు జాతీయ రహదారులశాఖ  మంజూరుచేసింది. మార్చిలోపు ముగించి చేసి ఏప్రిల్‌లో ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నారు. పలు ప్రైవేటు స్థలాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. న్యాయవివాదాలు, పరిహారం చెల్లింపులు కొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రధానకూడళ్లు పూర్తి చేయడానికి కూడా సమయం పడుతుంది. పైవంతెన పూర్తి చేసి వాహనాల రాకపోకలకు అనుమతి కల్పించడానికి చర్యలు చేపడుతున్నారు.

డబ్లింగ్‌ పనుల్లో.. ధర్మవరం- చిగిచెర్ల డబ్లింగ్‌ పనుల్లో భాగంగా ఈనెల 17 నుంచి 21 వరకు వివిధ పనుల నిమిత్తం పగటివేళల్లో రైళ్లు రద్దు చేశారు. ఆ సమయంలో రాప్తాడు వంతెన వద్ద గడ్డర్లు అమర్చారు. అప్పట్లో అనంతపురం పై వంతెనకు సర్వం సిద్ధం కాకపోవడంతో వాయిదా వేశారు.

ప్రజలకు ఇబ్బంది.. రైలు పట్టాలు నగరానికి నడిబొడ్డున ఉండటంతో ప్రజలు క్లాక్‌టవర్‌ కూడలి వైపునకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. వంతెన పనులు ఆలస్యమవుతుండటంతో బళ్లారి, కళ్యాణదుర్గం నుంచి నగరంలోని వచ్చే బస్సులు సైతం సోములదొడ్డి నుంచి గుత్తి రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండుకు వెళుతున్నాయి.

వారం లోపు..
రైల్వేట్రాక్‌ వద్ద వంతెన పనులకు అనుమతి కోరాం. సోమవారం వచ్చే అవకాశముంది. బుధ, గురువారాల్లో పనులు చేయిస్తాం. రైళ్లు వచ్చి వెళ్లేందుకు రెండు, మూడు గంటలు నిడివి ఉన్న సమయంలో పనులకు అనుమతిస్తారు. దిమ్మెలు నిలపడం రెండు, మూడు రోజుల్లో పూర్తవుతుంది. అనంతరం ఇతర పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Filed Under: News

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

  • Shamkarappa on 89- PEDDURU (Sachivalayam Code : 11090392) Secretariat Details | RAMA KUPPAM (RURAL) | CHITTOOR
  • Bhaskar Malepati on KAKAVEDU (Secretariat Code : 1118001) Sachivalayam information | NAGARI (MUNI) | CHITTOOR
  • Bhaskar Malepati on KAKAVEDU (Secretariat Code : 1118001) Sachivalayam information | NAGARI (MUNI) | CHITTOOR
  • V rao on G KONDURU – Meeseva Centers list, Address and Contacts Numbers
  • V rao on G KONDURU – Meeseva Centers list, Address and Contacts Numbers
  • Usha Kiran Javvadi on PONNUR (RURAL) GUNTUR District – Sachivalayam List
  • K GUNDAPPA on KODUMUR 1 (Sachivalayam Code : 11390601) Secretariat Details | KODUMUR (RURAL) | KURNOOL
  • Shaik on TATAKUNTLA (Sachivalayam Code : 10690613) Secretariat Details | VISSANNAPETA (RURAL) | KRISHNA
  • G Lalitha on LAKSHMI GANAPATHI COLONY (Secretariat Code : 1093002) Sachivalayam information | VIJAYANAGARAM (URBAN) | VIZIANAGARAM
  • Ajay on CHINNAYAGUDEM 1 (Sachivalayam Code : 10590777) Secretariat Details | DEVERAPALLI (RURAL) | WEST GODAVARI

Recent Posts

  • Jan Aushadhi Kendras (JAKs) List | Address & Contact Number
  • కోటప్పకొండ వీఐపీ బస్టాండ్ వివరాలు | KotappaKonda VIP Bus Stand Details
  • Andhra Pradesh State Bustands List
  • తుని బస్టాండ్ వివరాలు | Tuni Bus Stand Details | APSRTC Bus Station | Andhra Pradesh
  • తుది దశకు రైల్వే పైవంతెన పనులు | Railway overpass works in final stage

Pages

  • About
  • About Us
  • All India Bus Stands | Bus Stops | Bus Stations Information | All States BUS DEOPT
  • Buy Adspace
  • CONTACT US
  • Contact us
  • Disclaimer
  • Hide Ads for Premium Members
  • Privacy Policy
  • Sachivalayam.in – మీ సచివాలయం గురించి తెలుసుకోండి

Copyright © 2026 - SACHIVALAYAM.IN