Sachivalayam.in

  • Volunteer
  • AP Sachivalayams
    • Know Your Volunteer
    • Volunteer Details
  • UP GP List
  • CONTACT US

తుది దశకు రైల్వే పైవంతెన పనులు | Railway overpass works in final stage

February 28, 2023 by admin Leave a Comment

అనంతపురంలోని టవర్‌క్లాక్‌ వద్ద నిర్మిస్తున్న రైల్వే పైవంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. రైల్వేట్రాక్‌పై వంతెన అనుసంధానం చేయాల్సి ఉంది.

Anantapur

ఉమానగర్‌, అనంతపురం(రైల్వే): అనంతపురంలోని టవర్‌క్లాక్‌ వద్ద నిర్మిస్తున్న రైల్వే పైవంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. రైల్వేట్రాక్‌పై వంతెన అనుసంధానం చేయాల్సి ఉంది. ఇందుకోసం రైళ్లను ఆపాల్సి ఉన్న నేపథ్యంలో జాతీయ రహదారులశాఖ అధికారులు రైల్వేబోర్డుకు ఇప్పటికే లేఖ రాశారు. నిర్మాణానికి అవసరమైన భారీ గడ్డర్లు సిద్ధం చేశారు. వాటిని ఎత్తడానికి చెన్నై పోర్టు నుంచి భారీ క్రేన్‌ తెప్పించారు. 700 టన్నుల వరకు బరువెత్తే ఈ క్రేన్‌ ఆదివారం అనంతపురానికి చేరుకుంది.

నాలుగు వరుసల రహదారి.. బళ్లారిచౌరస్తా నుంచి నడిమివంక, టవర్‌క్లాక్‌, కలెక్టరేట్‌, పండమేరు మీదుగా సమతాగ్రాం వద్ద ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డు వరకు నాలుగు వరుసల రహదారి, 3 చోట్ల వంతెనలు, 3 కల్వర్టులు కలిపి ఒక ప్రాజెక్టుగా పనులు చేస్తున్నారు. ఇందుకు రూ.193 కోట్లు జాతీయ రహదారులశాఖ  మంజూరుచేసింది. మార్చిలోపు ముగించి చేసి ఏప్రిల్‌లో ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నారు. పలు ప్రైవేటు స్థలాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది. న్యాయవివాదాలు, పరిహారం చెల్లింపులు కొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రధానకూడళ్లు పూర్తి చేయడానికి కూడా సమయం పడుతుంది. పైవంతెన పూర్తి చేసి వాహనాల రాకపోకలకు అనుమతి కల్పించడానికి చర్యలు చేపడుతున్నారు.

డబ్లింగ్‌ పనుల్లో.. ధర్మవరం- చిగిచెర్ల డబ్లింగ్‌ పనుల్లో భాగంగా ఈనెల 17 నుంచి 21 వరకు వివిధ పనుల నిమిత్తం పగటివేళల్లో రైళ్లు రద్దు చేశారు. ఆ సమయంలో రాప్తాడు వంతెన వద్ద గడ్డర్లు అమర్చారు. అప్పట్లో అనంతపురం పై వంతెనకు సర్వం సిద్ధం కాకపోవడంతో వాయిదా వేశారు.

ప్రజలకు ఇబ్బంది.. రైలు పట్టాలు నగరానికి నడిబొడ్డున ఉండటంతో ప్రజలు క్లాక్‌టవర్‌ కూడలి వైపునకు వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. వంతెన పనులు ఆలస్యమవుతుండటంతో బళ్లారి, కళ్యాణదుర్గం నుంచి నగరంలోని వచ్చే బస్సులు సైతం సోములదొడ్డి నుంచి గుత్తి రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండుకు వెళుతున్నాయి.

వారం లోపు..
రైల్వేట్రాక్‌ వద్ద వంతెన పనులకు అనుమతి కోరాం. సోమవారం వచ్చే అవకాశముంది. బుధ, గురువారాల్లో పనులు చేయిస్తాం. రైళ్లు వచ్చి వెళ్లేందుకు రెండు, మూడు గంటలు నిడివి ఉన్న సమయంలో పనులకు అనుమతిస్తారు. దిమ్మెలు నిలపడం రెండు, మూడు రోజుల్లో పూర్తవుతుంది. అనంతరం ఇతర పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Filed Under: News

ఒక్క రూపాయి చిల్లర లేదన్న ఆర్టీసీ బస్‌ కండక్టర్‌.. ఏకంగా రూ.15 వేలు ఫైన్‌ వేసిన కోర్టు

February 22, 2023 by admin Leave a Comment

సాధారణంగా బస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు చిల్లర లేదని కండక్టర్లు బ్యాలెన్స్‌ ఇవ్వకుండా వెళ్లిపోతుంటారు. ఇది షరా మామూలేనని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఐతే ఓ వ్యక్తి మాత్రం అలా..

BMTC Bus Conductor Refuses to Return Rs 1 Change to Passenger Then Consumer Court Orders to Pay Rs 15000 Compensation

సాధారణంగా బస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు చిల్లర లేదని కండక్టర్లు బ్యాలెన్స్‌ ఇవ్వకుండా వెళ్లిపోతుంటారు. ఇది షరా మామూలేనని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఐతే ఓ వ్యక్తి మాత్రం అలా ఊరుకొని వెళ్లలేదు. బస్‌ టికెట్‌ ఇచ్చి చిల్లర లేదని ఒక్క రూపాయి ఇవ్వడానికి నిరాకరించిన ఆర్టీసీ బస్‌ కండక్టర్‌పై కోర్టులో కేసు వేసి, ఏకంగా మూడేళ్ల పాటు పోరాడి తుదకు విజయం సాధించాడా వ్యక్తి. 2019లో రమేష్ నాయక్ అనే వ్యక్తి శాంతినగర్ నుంచి మెజెస్టిక్ బస్ డిపోకు బీఎమ్‌టీసీ బస్సులో ప్రయాణించాడు. ఆ సమయంలో ప్రయాణికులు రూ.30 ఇవ్వగా.. కండక్టర్ రూ.29కి టిక్కెట్ ఇచ్చాడు. తనకు ఇంకా ఒక రూపాయి రావల్సి ఉందని, ఇవ్వమని ప్రయానికుడు కోరాడు. ఐతే కండక్టర్ మాత్రం తన దగ్గర రూపాయి చిల్లర లేదని చెప్పాడు. అంతటితో ఆగకుండా సదరు ప్రయాణికుడిపై కండక్టర్ దుర్భాషలాడాడు కూడా. దీంతో మనస్తాపానికి గురైన రమేష్ తనకు రూ.15 వేలు పరిహారం ఇవ్వాలని కోరుతూ జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఐతే రమేష్ ఫిర్యాదును స్వీకరించకపోగా కండక్టర్‌కే సపోర్టు చేస్తూ.. సర్వీస్‌లో లోపం ఉందన్న ఆరోపణలతో పిటిషన్‌ను కోర్టు కొట్టిపారేసింది.

అనంతరం రమేష్‌ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ కోర్టు (బీఎంటీసీ)లో అఫిడవిట్ దాఖలు చేశాడు. వాదనలు విన్న కోర్టు కండక్టర్ ఒక రూపాయితోపాటు ఫిర్యాదుదారుడు కోరిన రూ.15 వేలల్లో ప్రస్తుతం రూ.2,000 చెల్లించాలని, లీగల్ ఫీజు కింద రూ.1,000 చెల్లించాలని బెంగళూరు కోర్టు (బీఎంటీసీ) ఆదేశించింది. మిగిలిన మొత్తం 45 రోజుల్లో చెల్లించాలని, అలాచేయని పక్షంలో ఏడాదికి రూ.6 వేల చొప్పున వడ్డీ చెల్లించవల్సి ఉంటుందని కోర్టు తన తీర్పులో వెలువరించింది. ఈ సమస్యను లేవనెత్తడం చిన్నదిగా అనిపించినా.. అది వినియోగదారుడి హక్కు కు సంబంధించిన అంశంగా గుర్తించాలని పేర్కొంటూ.. ఈ పని చేసినందుకు కోర్టు అతన్ని అభినందించింది.

Filed Under: News

Fact Check on APSRTC Jobs: ‘దయచేసి నమ్మకండి.. అది ఫేక్‌ న్యూస్! ఉద్యోగాల భర్తీకి ఎటువంటి ప్రకటన చేయలేదు’

February 22, 2023 by admin Leave a Comment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో 5,418 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పేరుతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న వార్తపై ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు స్పందించారు. తాము ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ మంగళవారం (ఫిబ్రవరి 21) ప్రకటన..

APSRTC Clarifies Over Circulating Fake Recruitment Notification on social media

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ)లో 5,418 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పేరుతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న వార్తపై ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు స్పందించారు. తాము ఎటువంటి నోటిఫికేషన్‌ ఇవ్వలేదని స్పష్టం చేస్తూ మంగళవారం (ఫిబ్రవరి 21) ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి నకిలీ ప్రకటనలు నమ్మి నిరుద్యోగ అభ్యర్థులు మోసపోవద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కాగా గత కొంతకాలంగా ఏపీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్-2023 పేరుతో వాట్సాప్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలో ఆర్టీసీలో భర్తీకానున్న డ్రైవర్, కండక్టర్‌ ఉద్యోగాలకు ఆశావహ అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ వాట్సాప్‌లో చాలా మందికి మెసేజ్‌లు ఫార్వర్డ్‌లు వచ్చాయి. దీనిపై తాజాగా స్పందించిన ఆర్టీసీ అధికారులు ప్రకటనలో ఈ విధంగా పేర్కొన్నారు..

‘గతంలో ఇలాగే కొందరు ఫేక్ మెయిల్స్ ద్వారా చాలా మందిని మోసం చేసే చర్యలకు పాల్పడ్డారని, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా చాలా సులభంగా ఇలాంటి నకిళీ వార్తలను పంపుతున్నారని ఆర్టీసీ తెలిపింది. అభ్యర్థులు ముందుగానే ఫీజు చెల్లించాలని దానితో పాటు ఆధార్ కార్డులు, బ్యాంకు ఓటీపీ తదితర వివరాలన్నీ అందులో తెలపాలని సూచిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మీ వివరాలన్నీ సేకరించిన తర్వాత సైబర్ మోసాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తమై జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ కోరుతున్నది. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ఉంటే ఆర్టీసీ అధికారులే మీడియా ద్వారా గాని, పత్రికల ద్వారా గాని ఆ విషయాన్నీ అందరికీ తెలియజేసి అధికారికంగా ప్రకటిస్తారు. కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మకండి. వీటి పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ అధికారులు తాము విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Filed Under: News

News

January 17, 2023 by admin Leave a Comment

News

APSRTC – EDLIF Full Details

APSRTC Employee Pension Scheme Details

APSRTC Employees Provident Fund Information

APSRTC SPECIAL HIRE CHARGES for BUSES

APSRTC – PROHIBITED ITEMS IN THE BUS


For any queries regarding above topic, please feel free to discuss us through below comment session.

Filed Under: News

APSRTC – EDLIF Application Full Details | Required Documents for Apply

January 17, 2023 by admin Leave a Comment

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా స౦స్థ ఉద్యోగుల భవిష్యనిధి ట్రీస్తు

ఇడి.యల్‌.ఐ.ఎఫ్‌.  (EDLIF) ప్రయోజనాలు

ఇ.డి.యల్‌.ఐ.ఎఫ్‌. ద్వారా 01-09-2014, తర్వాత సర్వీసులో ఉండి చనిపోయిన సభ్యుని యొక్కనామినేషన్‌ ద్వారా అర్హులైన కుటుంబ సభ్యులకు వచ్చు సవరించబడిన ఆర్థిక ప్రయోజనం క్రింద విధంగా ఉన్నది

1. కనీస మొత్తము  Rs.35000/-

2. (ఎ) సభ్యుని మరణానికి ముందు భవిష్యనిధిలోని 12 నెలల సరాసరి నిల్వ రూ. 50,000/-లు గాని, దానికి తక్కువగాని ఉన్నప్పుడు, ఆ సరాసరి నిల్వ మొత్తము యధావిధిగా ఇవ్వబడును. సరాసరి నిల్వ రూ. 50,000/-లు కంటె ఎక్కువ ఉన్నచో రూ. 50,000/- + Rs.50,000/-ల కన్నా మించిన మొత్తముపై 40% ఇవ్వబడును. దీని గరిష్ట పరిమితి /-లేదా

(బి) సభ్యునిపే + డి.ఎ రూ. 15000/- పరిమితికి లోబడి, పింఛను ఆప్షన్‌తో నిమిత్తము లేకుండా సభ్యుని మరణానికి ముందు 12 నెలల
సరాసరిపే + డి.ఎ x 20(పే + డిఎకి 20 రెట్లు) గరిష్ట పరిమితి Rs.3,00,000/- గా ఇవ్వబడును.

పై ఎ,బి, ఆంశములలో, ఏ మొత్తము ఎక్కువ అయితే ఆ మొత్తమునకు అదనముగా 20%, అనగా గరిష్టముగా రూ.3,60,000/- ఇవ్వబడును

3. అర్హమైన ప్రతి మొత్తమునకు అదనముగా రూ. 100/- ఇవ్వబడును

apsrtc-edlif

ఇ.డి.యల్‌.ఐ.ఎఫ్‌. పొందుటకు అవసరమైన పత్రాలు

మరణ ధృవీకరణ పత్రము

ఉద్యోగి ఇచ్చిన పి.యఫ్‌ నామినేషన్‌ కాపీ

ఉద్యోగి మరణానంతరము యాజమాన్యం వెలువరించిన దెత్‌నోటి ఫికేషన్‌

నామిని బ్యాంకు ఖాతా మొదటి పేజి కాపీ

పూర్తిగా నింపబడిన నామినీ ఇ ఇచ్చే క్లెయిమ్‌ ఫారం

పై పత్రములు అన్నింటిపై సంబంధిత యూనిట్ ఆఫీసర్ / డిపో మేనేజర్ స్టాంపు తో కూడిన సంతకం ఉండవలెను


పై అంశానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి క్రింద ఉన్న కామెంట్ సెషన్ ద్వారా మాకు తెలియజేయండి.

Filed Under: News

  • 1
  • 2
  • Next Page »

Recent Comments

  • M.surendra on NELLUTLAVARI PALLI (Sachivalayam Code : 11090171) Secretariat Details | CHINNAGOTTIGALLU (RURAL) | CHITTOOR
  • M.surendra on NELLUTLAVARI PALLI (Sachivalayam Code : 11090171) Secretariat Details | CHINNAGOTTIGALLU (RURAL) | CHITTOOR
  • Shrinivas rao on Kuchipudi – Meeseva Centers list, Address and Contacts Numbers
  • BODDAPATI VEERANAGESWARARAO on DARSI (RURAL) PRAKASAM District – Sachivalayam List
  • Manmadha Rao Yarnagula on DCCB COLONY (Secretariat Code : 1085008) Sachivalayam information | SRIKAKULAM (URBAN) | SRIKAKULAM
  • Manmadha Rao Yarnagula on DCCB COLONY (Secretariat Code : 1085008) Sachivalayam information | SRIKAKULAM (URBAN) | SRIKAKULAM
  • Eamani Venkateswarlu on GUNTUPALEM (Sachivalayam Code : 10790243) Secretariat Details | SAVALYAPURAM (RURAL) | GUNTUR
  • Sarika Telluri on KOKILAMPADU (Sachivalayam Code : 10690626) Secretariat Details | TIRUVURU (RURAL) | KRISHNA
  • Prasanna on How to Book APSRTC Tickets Online
  • Venugopal Arasikere on Bank of Baroda – JAYANAGAR-BANGALORE Branch – IFSC, Address & Contact Details

Recent Posts

  • Jan Aushadhi Kendras (JAKs) List | Address & Contact Number
  • కోటప్పకొండ వీఐపీ బస్టాండ్ వివరాలు | KotappaKonda VIP Bus Stand Details
  • Andhra Pradesh State Bustands List
  • తుని బస్టాండ్ వివరాలు | Tuni Bus Stand Details | APSRTC Bus Station | Andhra Pradesh
  • తుది దశకు రైల్వే పైవంతెన పనులు | Railway overpass works in final stage

Pages

  • About
  • About Us
  • All India Bus Stands | Bus Stops | Bus Stations Information | All States BUS DEOPT
  • Buy Adspace
  • CONTACT US
  • Contact us
  • Disclaimer
  • Hide Ads for Premium Members
  • Privacy Policy
  • Sachivalayam.in – మీ సచివాలయం గురించి తెలుసుకోండి

Copyright © 2026 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in